షాదీరే... బాహుబ‌లి! (prabhas going to marriage)

షాదీరే… బాహుబ‌లి! (prabhas going to marriage)

షాదీరే… బాహుబ‌లి! (prabhas going to marriage)

భీమ‌వ‌రం: దేవ‌సేన‌ని ప్రేమించినందుకే… బాహుబ‌లి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌చ్చింది. చివ‌రికి క‌ట్ట‌ప్ప చేతిలో మ‌ర‌ణించాల్సి వ‌చ్చింది. కానీ, నిజ జీవితంలో బాహుబ‌లి ప్ర‌భాస్ ఎవ‌రినైనా ప్రేమించాడా? అయిదేళ్ళు బాహుబ‌లి షూటింగ్ లోనే గ‌డిపేసిన ప్ర‌భాస్… దేవ‌సేన అనుష్క‌తో బాగానే క‌నెక్ట్ అయ్యాడ‌ని సోష‌ల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. ఇక బాహు బ‌లి 1,2 ప్ర‌మోష‌న్ స‌మ‌యంలోనూ చాలా చోట్ల ప్ర‌భాస్ పెళ్లి ఎపుడు అని కామెంట్స్ వచ్చాయి. టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లోనూ ఇదే ప్రశ్న హాట్‌ టాపిక్‌గా మారిపోయింది. ఈ విషయం గురించి ప్రభాస్‌ను మీడియా ప్రశ్నిస్తే ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో ఏప్రిల్‌ 28న తెలిసింది కదా. ప్రభాస్‌ పెళ్లెప్పుడు అన్న విషయం కూడా ఏదో ఒక 28న తెలుస్తుంది’ అని చెప్పాడు. బాహుబ‌లి భారీ స‌క్సెస్ తో ప్ర‌భాస్ కు ఇంటా బ‌య‌టా స్టార్ డ‌మ్ తో పాటు పెళ్లి క‌ళ కూడా వ‌చ్చేసింది.
బాహుబ‌లికి భీమ‌వ‌రం వ‌ధువు!
రాజుల ఊరుగా ప్ర‌సిద్ది చెందిన భీమవరం నుంచే బాహుబ‌లికి వధువు రానున్న‌ట్లు స‌మాచారం. భీమవరానికి చెందిన ఓ వ్యాపారవేత్త మనవరాలితో ప్రభాస్‌ పెళ్లి జరగనున్నట్టు తెలుస్తోంది. డాలింగ్…డాలింగ్ అంటూ, ఎక్కువ‌గా మొహ‌మాట‌ప‌డే ప్ర‌భాస్ ఈ విషయమై ఎలాంటి ప్రకటన చేయ‌లేదు. కానీ, ప్ర‌భాస్ పెద‌నాన్న రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు మాత్రం దీనికి సంబంధించిన వ్య‌వ‌హారాలు చూస్తున్నార‌ని స‌మ‌చారం. ప్రస్తుతం ప్రభాస్‌ ‘సాహో’ చిత్రంలో నటిస్తున్నాడు. సుజిత్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాహుబ‌లి షూటింగ్ స‌మ‌యంలో డార్లింగ్, అనుష్క షెట్టి క్లోజ్ గా మూవ్ అయ్యార‌ని టాక్ వ‌చ్చింది. వీట‌న్నింటికీ చెక్ చెపుతూ, భీమ‌వ‌రం బ‌ల్లెమ్మ ఎంట్రీ ఇస్తుంద‌న్న‌మాట‌.Prabhas-and-Anushka-Shetty

Author Biography:

Leave a Reply

Translate »