రైతు కోసం ఆమ్ ఆద్మీ ర‌ణ భేరి! (aap Riatu Rana Bheri sucess)

రైతు కోసం ఆమ్ ఆద్మీ ర‌ణ భేరి! (aap Riatu Rana Bheri sucess)

రైతు కోసం ఆమ్ ఆద్మీ ర‌ణ భేరి! (aap Riatu Rana Bheri sucess)

.WhatsApp Image 2017-08-13 at 9.24.09 PM WhatsApp Image 2017-08-13 at 9.24.11 PM WhatsApp Image 2017-08-13 at 9.24.11 PM (1)ఆప్ అధికారంలోకి వ‌స్తే… రైతుకు పంగ‌డే: ఏపీ ఇన్ ఛార్జి సోమ‌నాథ్ భార‌తి
గుంటూరు: విద్య, వైద్యంలో విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులు తీసుకువ‌చ్చిన ఢిల్లీ ఆమ్ ఆద్మీ ప్ర‌భుత్వం, ఇపుడు రైతుల కోసం దేశ‌వ్యాప్తంగా ఉద్య‌మిస్తోంది. రైతు సంక్షేమం కోసం స్వామినాథ‌న్ క‌మిష‌న్ సిఫార‌సుల‌ను అమ‌లు చేయాల‌ని డిమాండు చేస్తోంది. దేశ వ్యాప్తంగా చేస్తున్న ఆందోళ‌న‌లో భాగంగా ఆప్ గుంటూరులో రైతు ర‌ణ భేరీ నిర్వ‌హించింది. ఆప్ ఏపీ ఇన్ ఛార్జి క‌న్వీన‌ర్ పోతిన వెంక‌ట రామారావు అధ్య‌క్ష‌త‌న స్థానిక రైల్వే ఇనిస్టిట్యూట్ హాలులో నిర్వ‌హించిన రైతు స‌ద‌స్సుకు ముఖ్య అతిథులుగా వ‌డ్డే శోభ‌నాద్రీశ్వ‌ర‌రావు, ఆప్ సౌతిండియా ఇన్ ఛార్జి సోమ‌నాథ భార‌తి హాజ‌ర‌య్యారు. వీరితోపాటు రైతు నాయ‌కులు ఎర్నేని నాగేంద్ర‌, కె.విజ‌య‌రావు, ముప్పాళ్ళ నాగేశ్వ‌ర‌రావు, అనుమోలు గాంధీ త‌దిత‌రులు త‌మ గ‌ళం క‌లిపారు. రైతు సంక్షేమాన్ని గాలికొదిలేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు గుణ‌పాఠం నేర్పాల‌ని పిలుపు నిచ్చారు. ఆప్ నేత సోమ‌నాథ్ భార‌తి మాట్లాడుతూ, స్వామినాథ‌న్ క‌మిష‌న్ సిఫార‌సుల‌ను కేంద్రం త‌క్ష‌ణ‌మే అమ‌లు చేయాల‌ని డిమాండు చేశారు. రైతు సంక్షేమంపై మోదీ ప్ర‌భుత్వానికి చిత్త‌శుద్ధి లేద‌ని, వారికి అదాని, అంబానీల సంక్షేమే ముఖ్య‌మ‌న్నారు. ఢిల్లీలో ఇప్ప‌టికే ఆమ్ ఆద్మీ అమ‌లు చేస్తున్న ప‌రిపాల‌నా సంస్క‌ర‌ణ‌లు ప్ర‌ధాని మోడీ అండ్ కో వెన్నులో వ‌ణుకు పుట్టిస్తున్నాయ‌న్నారు. ఢిల్లీలో భూసేక‌ర‌ణ ఎక్క‌డ‌ జ‌రిగినా, బాధితుల‌కు మార్కెట్ ధ‌ర క‌ల్పిస్తున్నామ‌ని, ఏపీలో సీఎం చంద్ర‌బాబు త‌ర‌హాలో భూముల్ని బ‌ల‌వంతంగా లాక్కోవ‌డం దారుణ‌మ‌ని సోమ‌నాథ్ విమ‌ర్శించారు. రైతు నాయ‌కులు వ‌డ్డే, ఎర్నేని నాగేంద్ర‌, ముపాళ్ల నాగేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు ఢిల్లీలో ఆప్ సంస్క‌ర‌ణ‌ల‌ను ప్ర‌శంసించారు. స్వామినాథ‌న్ క‌మిష‌న్ నివేద‌క‌ను అమ‌లు చేసే స‌త్తా, ఆప్ కే ఉంద‌ని… దేశవ్యాప్తంగా ఆప్ ప్ర‌భుత్వం ఏర్పాటు అయితే అది సామాన్యుల సొంత ప్ర‌భుత్వం అవుతుంద‌ని ఆప్ ఏపీ ఇన్‌ఛార్జి క‌న్వీన‌ర్ పోతిన వెంక‌ట రామారావు పేర్కొన్నారు. ఈ స‌మావేశంలో ఆప్ 13 జిల్లాల నేత‌లు పాల్గొన్నారు. గుంటూరు బాధ్యులు, డాక్ట‌ర్ సేవాకుమార్, రంజిత్ కుమార్, జ‌య‌దేవ్, ఆప్ రాష్ట్ర నాయ‌కులు హ‌ర్ మొహింద‌ర్ సింగ్ స‌హానీ, బూరాడ య‌జ్ననారాయ‌ణ‌, స‌త్యాగాంధి, కంభంపాటి కృష్ణ‌మూర్తి, యూత్ నాయ‌కులు వినోద్, విన‌య్ త‌దిత‌రులు పాల్గొన్నారు.
గుంటూరులో హైలైట్ గా… ఆప్ రైతు ర్యాలీ
గుంటూరు న‌గ‌ర వీధుల్లో ఆప్ నిర్వ‌హించిన రైతు ర్యాలీ హైలైట్ గా నిలిచింది. రైతుల‌కు న్యాయం చేయాల‌ని, స్వామినాథ‌న్ క‌మిష‌న్ సిఫార‌సుల‌ను అమ‌లు చేయాల‌ని డిమాండు చేస్తూ, ఆప్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, రైతులు క‌లిసి ఈ ర్యాలీ నిర్వహించారు. rally

Author Biography:

Leave a Reply

Translate »