
ఢిల్లీలో ‘కావేరి’ చర్చలు. (kavery rever discusions in delhe)
kavery rever discusions in delhe
న్యూఢిల్లీ: కావేరి నది జల వివాదంపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతితో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, తమిళనాడు పీడబ్ల్యూడీ మంత్రి ఎడప్పడి కే పళని సామి గురువారం భేటీ అయ్యారు. తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యం కారణంగా ఈ భేటీకి హాజరు కాలేకపోయారు.
రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున బుధవారం నుంచి మూడు రోజుల పాటు 18 క్యూసెక్కుల కావేరి జలాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రంతో చర్చించి సమస్యను పరిష్కరించుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం సలహా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఉమాభారతి అధ్యక్షతన కర్ణాటక, తమిళనాడు ప్రతినిధులు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
- ‹ Previous
Leave a Reply
You must be logged in to post a comment.