ట్రంప్ గెలుపుతో సంప్ లో టీడీపీ! ఇక‌నైనా భ‌జ‌న ఆపుతారా బాబూ!

ట్రంప్ గెలుపుతో సంప్ లో టీడీపీ! ఇక‌నైనా భ‌జ‌న ఆపుతారా బాబూ!

ట్రంప్ గెలుపుతో సంప్ లో టీడీపీ! ఇక‌నైనా భ‌జ‌న ఆపుతారా బాబూ!

 

 అమ‌రావ‌తి: అమెరికా అధ్య‌క్షుడిగా డోనాల్డ్ ట్రంప్ గెలిస్తే… ఇక్క‌డ టీడీపీకి షాక్ ఏంట‌ని అనుకుంటున్నారా? అధినేత మెప్పు కోసం ఓవ‌ర్ యాక్ష‌న్ చేస్తే… రియాక్ష‌న్ ఇలాగే ఉంటుంది మ‌రి. చంద్ర మండ‌లం ద‌గ్గ‌ర నుంచి, సూది మొన వ‌ర‌కు అన్నీ చంద్ర‌బాబుకే తెలుసు అన్న‌ట్లు… ఆయ‌న మెప్పు కోసమని భజన మీడియా బృందం ఒక్కోసారి హద్దులు మీరి ప్రవర్తిస్తోంది. అది కాస్తా, చంద్రబాబు మెడ‌కు చుట్టుకుంటోంది.   ఆ లెక్క‌న, డొనాల్డ్ ట్రంప్ తెలుగుదేశం పార్టీకి పెద్ద షాకే ఇచ్చారు. అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం హిల్లరీ క్లింటన్, ట్రంప్ నువ్వా నేనా అన్న‌ట్లు పోటీప‌డుతున్న‌స‌మ‌యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు డొనాల్డ్ ట్రంప్ పై వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ కు వ్యక్తిగత విలువలు లేవని, కుటుంబ విలువలు లేవని తన ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యానించారు.  పెద్దాయ‌నే ఇంత మాట‌ల‌న్నాక‌…ఇక ఎల్లో మీడియా ఊరుకుంటుందా? అమెరికాలో ఉన్న టిడిపి మద్దతుదారులందరికీ హిల్లరీకి ఓట్లు వేయమని, మిగిలిన వారితో కూడా ఓట్లు వేయించాల్సిందిగా టిడిపి ప్రముఖులు చెబుతున్నట్లు భజన మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు.  ఎన్నికల్లో హిల్లరీ గెలుపు త‌థ్య‌మ‌ని, చంద్రాబాబు ఆకాంక్ష కూడా ఇదే అని భజన చేసారు. పైగా హిల్లరీ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబునాయడు కుటుంబానికి ఆహ్వనాలు కూడా అందినట్లు కూడా చెప్పుకొచ్చారు. కానీ, మంగళవారం ఓట్ల కౌటింగ్ మొ
దలైన కొంత సేపటికి ట్రంప్ కు వస్తున్నఆధిక్యం చూసి టీడీపీ శ్రేణులు డీలా ప‌డిపోయాయి. ఇదేదో ఏపీలో జ‌రుగుతున్న ఎన్నిక‌ల‌న్నంత టెన్ష‌న్, ప్రిస్టేజీ ఫీల‌య్యాయి. ఏదో తమ నేతే ఓడిపోయినట్లు ఢీలా పడ్డారు త‌మ్ముళ్లు. తీరా బుధవాtrumphరం మధ్యాహ్నానానికి ట్రంప్ విజయం ప్ర‌క‌టితం కావ‌డంతో టిడిపికి పెద్ద షాకే తగిలినట్లైంది. ట్రంప్ విజయం ఖాయమవ్వగానే చంద్రబాబు, హిల్లరీలపైన సోషల్ మీడియాలో విపరీతమైన జోకులు కనబడటం…నిజంగా చంద్ర‌బాబు గ‌మ‌నించుకుంటే… భ‌జ‌న మీడియాకు బ్యాండ్ వాయించేస్తారేమో!

Author Biography:

Leave a Reply

Translate »