⁠⁠⁠రాగి చెంబులో నీళ్ళు తాగండి...బ‌రువు త‌గ్గి... స్లిమ్ అయిపోతారు (slim with copper)

⁠⁠⁠రాగి చెంబులో నీళ్ళు తాగండి…బ‌రువు త‌గ్గి… స్లిమ్ అయిపోతారు (slim with copper)

⁠⁠⁠రాగి చెంబులో నీళ్ళు తాగండి…బ‌రువు త‌గ్గి… స్లిమ్ అయిపోతారు (slim with copper)

Image result for drinking with copper glassఇపుడంతా plastic, గాజు గ్లాసులే ఎక్కువ‌గా వాడుక‌లో ఉన్నాయి.. వీలైతే paper glasses కూడా వాడేస్తున్నారు. కానీ, రాగి పాత్ర‌లో మంచి నీళ్ళు తాగితే ఎంత మంచిదో తెలుసా? ఇది bacteriaను అరిక‌డుతుంద‌ని ప‌రిశోధ‌న‌లో తేలింది.
Rob reed అనే micro biologist ప్లాస్టిక్, మట్టి, రాగి పాత్రల‌లో విరోచనాకారి అయిన bacteriaతో కూడిన నీటిని వాటిలో ఉంచి, 48గంటల తరువాత ఆ నీటిపై ప‌రిశీల‌న చేశాడు. రాగి పాత్రలో ఉంచిన నీళ్ళ‌లో bacteria శాతం తగ్గింది. అదే ప్లాస్టిక్, మ‌ట్టి పాత్రలో ఉన్న bacteria శాతం రెండింతలు అయ్యింది.
రాగి పాత్ర వ‌ల్ల ఉప‌యోగాలు:
* జీర్ణ వ్యవస్థకు మంచిది: రాగి పాత్రలో నీలు తాగడం వల్ల acidity, gas, అజీర్ణం వంటివి తగ్గడం కాకుండా, , మీ కడుపుకి హాయి కలిగించి, ప్రాణాంతకరమైన bacteriaను కూడా నిర్మూలిస్తుంది. కిడ్నీ ఇంకా liver చురుకుగా పనిచేయడంలో తోడ్పడుతుంది.
* Weight Loss: మనం అధిక బరువు తగ్గడానికి రకరకాల పండ్లు, కూరగాయలు వంటివి తింటూ ఉంటాం. కాని వాటివల్ల వచ్చే ప్రయోజనాల కన్నా, వాటికి ఖర్చుపెట్టిన డబ్బు వ్యర్ధం అయిందన్న దిగులే ఎక్కువ. రాగి పాత్రలో నీలు తాగడం వల్ల అది మీ జీర్ణ వ్యవస్థను సరైన మార్గంలో నడిచేలా చేసి, కొవ్వు మరియు ఇతర చెడు బాక్టీరియాను శరీరం నుండి తీసేస్తుంది.
* గాయాలను త్వరగా నయం చేస్తుంది: రాగిలో ఉండే యాంటి-బాక్టీరియా తత్వం శరీరంలోని అనేక గాయాలను వేగంగా నయం చేయడంతోపాటు రోగనిరోధక వ్యవస్థను మెరుగు పరిచి, శరీరంపై ఉన్న గాయాలనే కాకుండా లోపల ఉన్న గాయాలను, ముఖ్యంగా కడుపులో ఉన్న గాయాలను కూడా తగ్గించడంలో సహాయం చేస్తుంది.
* మీ వయసును దాచేస్తుంది: కొంతమంది ఆరోగ్య పరంగా ఎంత activeగా ఉన్నా వారి వయసు మించి కనిపిస్తూ ఉంటారు. ఈ సమస్య నుంచి బాధ పడేవారు చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారు రాగి నుండి ఉత్పత్తి అయ్యే ప్రయోజనాలతో వారి సమస్య నుండి విముక్తి ల‌భిస్తుంది. ముఖంపై ఉన్న మచ్చలు, ముడతలు వంటివి రాగి తగ్గిస్తుంది.
* క్యాన్సర్ వ్యాధి నుండి పోరాడుతుంది: రాగిలో ఉండే అనామ్లజనకాలు (anti-oxident) క్యాన్సర్ వంటి ప్రాణాంతకరమైన రోగాల నుండి కాపాడుతుంది. American Cancer Society వారు చేసిన పరిశోధనాల ప్రకారం రాగి క్యాన్సర్ ను ఎలా రానివ్వకుండా చేస్తుందో కనుగొనలేకపోయారు. కాని రాగి నిరంతరం క్యాన్సర్ వ్యాపింపజేసే వైరస్ ను అడ్డుకోనడంలో తోడ్పడుతుందని ఆ పరిశోధనల్లో తేలింది.
* Brain ను మెరుగుపరుస్తుంది: మన శరీర భాగంలో అతి ముఖ్యమైన అవయవాల్లో ఒకటి మెదడు. మనిషి శరీరంలో ప్రతీ ఒక్క భాగానికి మెదడుతో సంబంధాలు కలిగి ఉంటాయి. మెదడు నుండి ఆయా భాగాలకు న్యురాన్ల ద్వారా సంకేతాలు అందుతాయి. ఈ న్యురాన్లను మైలిన్ తొడుగు కాపాడుతుంది. రాగిలో ఉండే విలువైన పదార్థాలు ఈ మైలిన్ తొడుగును కపాడంతోపాటు, మెదడును చురుకుగా, యవ్వనంగా తయారు చేస్తుంది.
Food and drug Administration వారి ప్రకారం రాగిని రోజుకు 12మి.గ్రా కన్నా ఎక్కువ తీసుకునే అవసరం లేదు అంటే రాగి పాత్రలో కనీసం 8 గంటలు ఉంచిన మంచి నీటిని రోజుకి 3 నుంచి 4 సార్లు తీసుకుంటే సరిపోతుంది.
– రాగి పాత్రని soapతో కాకుండా సగం కోసిన నిమ్మ చెక్కతో లేదా వంట సోడాతో రుద్ది నీటితో కడిగితే సరిపోతుంది.

Author Biography:

One thought on “⁠⁠⁠రాగి చెంబులో నీళ్ళు తాగండి…బ‌రువు త‌గ్గి… స్లిమ్ అయిపోతారు (slim with copper)”

  1. Sujat-charry says:

    really… copper is better than any other metal

Leave a Reply

Translate »