క‌ట్టేది త‌క్కువ‌...కూల్చేది ఎక్కువ‌... న‌వ్యాంధ్ర‌లో దేవాల‌యాలూ ధ్వంసం!!

క‌ట్టేది త‌క్కువ‌…కూల్చేది ఎక్కువ‌… న‌వ్యాంధ్ర‌లో దేవాల‌యాలూ ధ్వంసం!!

క‌ట్టేది త‌క్కువ‌…కూల్చేది ఎక్కువ‌… న‌వ్యాంధ్ర‌లో దేవాల‌యాలూ ధ్వంసం!!

క‌ట్టేది త‌క్కువ‌…కూల్చేది ఎక్కువ‌… న‌వ్యాంధ్ర‌లో దేవాల‌యాలూ ధ్వంసం!!

విజ‌య‌వాడ‌:  న‌వ్యాంధ్ర తాత్కాలిక రాజ‌ధాని విజ‌య‌వాడ‌లో ఇపుడు ఎక్క‌డ చూసినా కూల్చివేత‌లే క‌నిపిస్తున్నాయి. హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు ప్ర‌భుత్వ కార్యాల‌యాలు అన్ని త‌ర‌లుతున్న నేప‌థ్యంలో ఇక్క‌డ భారీ నిర్మాణాలు వ‌స్తాయ‌ని స్థానికులు భావించారు. కానీ, ఇంత‌వ‌ర‌కు ఇక్క‌డ ఒక్క భ‌వ‌నం క‌ట్ట‌క‌పోగా, ఉన్న నిర్మాణాల‌ను కూల్చే ప‌నిలో ప్ర‌భుత్వం ఉంది. విజ‌య‌వాడ‌లో ఇప్పుడు ఎక్క‌డ చూసినా, రోడ్డు వెడ‌ల్పు పేరుతో నిర్మాణాల కూల్చివేత‌… ప్ర‌ముఖ‌, ప్ర‌సిద్ధి పొందిన ఆల‌యాలు, నిర్మాణాల తొల‌గింపులో అధికారులున్నారు. భ‌వానీపురం నుంచి వ‌న్ టౌన్ వినాయ‌కుడి గుడి వ‌ర‌కు, సీత‌మ్మ‌వారి పాదాల వ‌ర‌కు రోడ్డును వెడ‌ల్పు చేశారు. ఫ్ల‌యి వోవ‌ర్ నిర్మిస్తున్నామ‌ని, ఇరువైపులా నిర్మాణాల‌ను కొట్టేశారు. అయితే, దీనికి అంద‌రూ స‌మ్మ‌తంగానే ఉన్నారు. ఎందుకంటే అంద‌రికీ ఇక్క‌డ ఫ్ల‌యివోవ‌ర్ కావాలి. కానీ, అది ప్ర‌భుత్వ అధికారుల ఓవ‌ర్ యాక్ష‌న్ కు దారితీస్తోంది. కృష్ణా న‌ది ఒడ్డున ఉన్న పురాత‌న ఆల‌యాల‌న్నింటినీ ప‌డేశారు. దేశంలో ఏకైక దేవాల‌యంగా ప్ర‌సిద్ధి గాంచిన ప్ర‌త్యేక శ‌నైశ్చ‌ర స్వామి దేవాల‌యాన్ని కూడా కూల్చేశారు. వాస్త‌వానికి వాటిని కూల్చాల్సిన అవ‌స‌రం లేదు. ఎంత అత్యాధునిక ఫ్ల‌యివోవ‌ర్లు వ‌చ్చినా, ఈ దేవాల‌యాలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి. మ‌న సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను ప్ర‌తిబింబింస్తాయి. కానీ, వాటిని ప‌డేయ‌డం ప్ర‌భుత్వానికి దుర్గ‌తి ప‌ట్టిస్తుంద‌ని స్థానికులు శాప‌నార్ధాలు పెడుతున్నారు. మ‌రో ప‌క్క దుర్గ‌గుడి వ‌ద్ద గోశాల‌ను కూడా పూర్తిగా కూల్చివేశారు. ఎప్ప‌టి నుంచో ద‌శాబ్దాలుగా ఇక్క‌డ దుర్గ‌గుడికి అనుబంధంగా గోశాల న‌డుస్తోంది. అమ్మ‌వారికి దానం ఇచ్చి ఆవుల్ని ఇక్క‌డే పెంచుతుంటారు. భ‌క్తులు ఇక్క‌డ గోపూజ‌లు కూడా చేస్తారు. అలాంటి గోశాల‌ను ప‌డ‌వేయ‌డంపై హిందూ స‌మాజంలో తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది.

Author Biography:

Leave a Reply

Translate »