మితాహారం...అమితమైన ప‌ని...ద‌టీజ్ చంద్ర‌బాబు @66

మితాహారం…అమితమైన ప‌ని…ద‌టీజ్ చంద్ర‌బాబు @66

మితాహారం…అమితమైన ప‌ని…ద‌టీజ్ చంద్ర‌బాబు @66

1461309858-1267మితాహారం…అమితమైన ప‌ని…ద‌టీజ్ చంద్ర‌బాబు @66
28 ఏళ్ళ వయసులో ఎమ్మెల్యే
30 ఏళ్ళ వయసులో మంత్రి
46 ఏళ్ళ వయసులో ముఖ్యమంత్రి
యునైటెడ్ ఫ్రంట్ ఛైర్మన్… ప్రధాని అయ్యేందుకు రెండుసార్లు అవకాశాలు
రాజకీయ రంగానికి ప్రొఫెషనలిజమ్ ఆపాదించిన మొదటి పొలిటీషియన్
ఓర్పు, సహనాలు మేళవించుకున్న అవిశ్రాంత రాజకీయ కార్మికుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి… నారా చంద్రబాబు నాయుడు…
66 ఏళ్ళ వ‌య‌సులో కూడా చంద్రబాబు రోజుకి 18 గంట‌లు పని చేస్తున్నారు. తెల్లవారుజామున 4 గంట‌ల‌కే నిద్రలేచే చంద్రబాబు యోగాతో తన దిన చర్యను ప్రారంభిస్తారు దినచర్య రాత్రి 12గంటల వరకు కొనసాగుతుంది. ఓ వైపు జిల్లాల పర్యటనలు చేస్తూనే..మరోవైపు విజ‌య‌వాడ‌లోని క్యాంపు ఆఫీస్‌లో రివ్యూలు చేస్తూ అధికారులకు దిశా నిర్దేశం ఇస్తుంటారు. 66 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు చాలా యాక్టివ్‌గా ఉండడానికి ప్రధాన కారణం ఆయన తీసుకునే మితాహారమే. ఉదయం ప్లేటు ఇడ్లీ, మధ్యాహ్నం రెండు పుల్కాలు, పండ్లు, రాత్రిపూట చపాతి, పండ్లతో భోజనాన్ని ముగిస్తారు.
చిత్తూరు జిల్లా నారావారిప‌ల్లెలో నారా ఖ‌ర్జురనాయుడు, అమ్మణమ్మల దంపతులకు జన్మించిన చంద్రబాబు..ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రయ్యారు. ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్ల కాలంలో చంద్రబాబు అనేక సవాళ్లు, ప్రతిసవాళ్లను ఎదుర్కొన్నారు. అయినా వాటన్నింటిని ఒక్కొక్కటిగా అధిగమిస్తూ..పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. సాధారణ ఎన్నికలకు ముందు 2,817 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి..ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టాంచారు. నవ్యాంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి రెండేళ్లు కావొస్తుంది. ఈ రెండేళ్ళ కాలంలో కూడా సీఎంగా అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఇంకా చంద్రబాబు ముందు అనేక స‌వాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం… కేంద్రం నుంచి ప్ర‌త్యేక‌హోదా, నిధులు రాబ‌ట్ట‌డంతో పాటు త‌న రాజ‌కీయ వార‌సుడిని తీర్చిదిద్ద‌డం…పార్టీ ప‌గ్గాలు చేజార‌కుండా ప‌ట్టుకోవ‌డం…అయ‌న ముందున్న స‌వాళ్ళు…రియ‌ల్ న్యూస్ ఈ అవిశ్రాంత శ్రామికుడికి అభినంద‌న‌లు తెలుపుతోంది.

Author Biography:

Leave a Reply

Translate »