176 ఏళ్ళ పురాత‌న స్టూడియో మూత‌ (Born & Sheaperd closed)

176 ఏళ్ళ పురాత‌న స్టూడియో మూత‌ (Born & Sheaperd closed)

176 ఏళ్ళ పురాత‌న స్టూడియో మూత‌ (Born & Sheaperd closed)

కోలకతా: ప్రపంచంలో ఉన్న అత్యంత పురాతన photo స్టూడియోల్లో ఒకటిగా పేరుగాంచిన ‘బోర్న్‌ అండ్‌ షెపర్డ్‌’ Born & Sheaperd studio మూతపడింది. digital techonology విస్తృతమైన నేటి ఆధునిక కాలంలో దీని ద్వారా సేవలు అందించలేమంటూ 176 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ studioను మూసివేశారు.

1840లో మధ్య culcuttaలోని సెలపండే ప్రాంతంలో ప్రముఖ British photographer విలియమ్‌ హవ ర్డ్‌, శామ్యూల్‌ బోర్న్‌, చార్లెస్‌ షెపర్డ్‌ దీనిని ప్రారంభించారు. అప్పుడు ప్రారంభమైన ఈ studio ప్రపంచంలోనే అత్యంత పురాతన స్టూడియోల్లో ఒకటిగా పేరుగాంచింది. british పాలనలో ఈ స్టూడియో ఫొటో గ్రాఫర్లు తీసిన ఫొటోలు ఇప్పుడు వాషింగ్టన్‌లోని స్మిత్‌ సోనియన్‌ గ్రూప్‌ మ్యూజియం, నేషనల్‌ పోట్రైట్‌ గ్యాలరీ ఇన్‌ లండన్‌, cambridge universityలైబ్రరీ, నేషనల్‌ జియోగ్రాఫిక్‌ సొసైటీల్లో ఉన్నాయి.

ఢిల్లీ దర్బారులో ఫొటోలు తీసేందుకు ఈ studio నుంచి ప్రత్యేకంగా ఫొటో గ్రాఫర్లు అక్కడ ఉండేవారు. అంతేకాకుండా ‘కైజర్‌-ఇ-హింద్‌’ గౌరవాన్ని కూడా ఈ స్టూడియో పొందింది. ‘గురువారం నుంచి స్టూడియో మూసివేశాం. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. పైగా భార‌త ప్ర‌భుత్వం నుంచి కొన్ని legal స‌మ‌స్య‌లు కూడా ఉన్నాయి. మేము వృద్ధులమయ్యాం. ఇక స్టూడియోను ఎలా నడపాలి’ అని యజమాని జయంత్‌ గాంధీ తెలిపారు. ఈ studioలో ఉన్న పురాతన కెమేరాలను దాచి ఉంచుతామని ఆయన తెలిపారు.

Author Biography:

Leave a Reply

Translate »