ప‌ద‌వి ముంచిన ఫేస్ బుక్....ఐవైఆర్ కృష్ణారావు స‌స్పెన్ష‌న్!

ప‌ద‌వి ముంచిన ఫేస్ బుక్….ఐవైఆర్ కృష్ణారావు స‌స్పెన్ష‌న్!

ప‌ద‌వి ముంచిన ఫేస్ బుక్….ఐవైఆర్ కృష్ణారావు స‌స్పెన్ష‌న్!

అమ‌రావ‌తి: ఎఫ్.బి… అంటే ఫేస్ బుక్…దీని వ‌ల్ల ఎన్నో అన‌ర్ధాలు సంభివిస్తున్నాయ‌ని వింటున్నాం… ఇపుడు తాజాగా ఈ జాబితాలోకి సాక్షాత్తు మాజీ ఛీఫ్ సెక్ర‌ట‌రీ ఐవైఆర్ కృష్ణారావు చేరిపోయారు. ఏపీ బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ కు ఛైర్మ‌న్ గా ఉన్న ఐవైఆర్…త‌న ఫేస్ బుక్ లో నుంచి ఏపీ సీఎంకు సంబంధించిన అవాంఛ‌నీయ‌మైన వ్యాఖ్య‌ల పోస్టింగ్ షేర్ చేశార‌ని ఆయ‌న ప‌ద‌వికే ఎస‌రు పెట్టారు. ఇప్ప‌గుంట య‌శోధ‌ర రామ‌కృష్ణారావు పేరు మీద ఉన్న ఫేస్ బుక్ అకౌంట్ లో చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా పోస్టింగులు, వెబ్ న్యూస్ అయిటెమ్ లు షేరే చేశార‌ని టీడీపీ ఐటీ విభాగం విరుచుకుప‌డింది. వీటిని ఐవైఆర్ కావాల‌నే టీడీపీకి వ్య‌తిరేకంగా షేర్ చేశార‌ని దేశం అభిమానులు ఆరోపించారు. సీఎం చంద్ర‌బాబుకు కుల గ‌జ్జి …అంటూ అనుచితంగా చేసిన వ్యాఖ్య‌ల‌ను ఐవైఆర్ షేర్ చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. ప్ర‌భుత్వంలో ఉన్న‌తాధికారిగా ప‌నిచేసి, తెలుగుదేశం ప్రాప‌కంతో బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్లో ఛైర్మ‌న్ ప‌ద‌విలో కొన‌సాగుతూ ఐవైర్ ఇలాంటి వ్యాఖ్య‌ల‌ను ఎఫ్.బి.లో ప్ర‌మోట్ చేయ‌డం దారుణ‌మ‌ని, ఆయ‌న‌పై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఒత్త‌డి తెచ్చారు. దీనితో ఐవైఆర్ ను ఆ ప‌ద‌వి నుంచి తొల‌గించారు. అయితే, ఆయ‌న పేరిట ఉన్న ఎఫ్.బి.ని మూర్తి అనే వ్య‌క్తి నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయినా, త‌న‌కు ఎఫ్.బిలో అయిటెమ్స్ షేరింగ్ తోల సంబంధం లేద‌ని ఐ.వై.ఆర్. నుంచి ఎటువంటి వాయిస్ బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో … ఎఫ్.బి. ఆయ‌న కొంప ముంచింది. బ్రాహ్మిణ్ కార్పొరేష‌న్ నుంచి ఐవైఆర్ కు ఉద్వాస‌న‌… ఆయ‌న త‌ర్వాత ఆ ప‌ద‌వికి వార‌సుడిగా రేవూరి ఆనంద సూర్య‌…నియామ‌కాలు జ‌రిగిపోయాయి.

Author Biography:

Leave a Reply

Translate »