స‌త్యం వ‌ధ‌...ధ‌ర్మం చెర‌! స‌త్యంబాబుకు బాస‌ట ఏదీ?

స‌త్యం వ‌ధ‌…ధ‌ర్మం చెర‌! స‌త్యంబాబుకు బాస‌ట ఏదీ?

స‌త్యం వ‌ధ‌…ధ‌ర్మం చెర‌! స‌త్యంబాబుకు బాస‌ట ఏదీ?

విజ‌య‌వాడ‌: అభం శుభం తెలియ‌ని అయేషా మీరాపై ఆ కిరాత‌కులు అత్యాచారం చేశారు. దారుణంగా హ‌త్య చేశారు. కానీ, రాజ‌కీయ అండ‌తో నేర‌గాళ్ళు ద‌ర్జాగా కులుకుతున్నారు. చేయ‌ని త‌ప్పున‌కు స‌త్యంబాబు క‌ట‌క‌టాల పాల‌య్యాడు. ఎనిమిదేళ్ళ‌పాటు న‌ర‌కం చూశాడు. ఇపుడు న్యాయ‌స్థానం స‌త్యంబాబు నిర్దోషి అని తేల్చేసింది….కానీ, అన్యాయం అయిపోయిన స‌త్యానికి న్యాయం చేసేదెవ‌రు? అత‌ను అనుభ‌వించిన క‌ష్టానికి విలువ క‌ట్టి చెల్లించ‌గ‌ల‌రా? అయినా కోర్టు స‌త్యంబాబు కేసు స‌వ్యంగా విచారించ‌లేద‌ని పోలీసు అధికారుల‌కు అక్షింత‌లు వేసింది. స‌త్యంబాబుకు ల‌క్ష రూపాయ‌ల ప‌రిహారం చెల్లించాల‌ని ఆదేశించింది. అయినా ఇంత అన్యాయంగా ఎనిమిదేళ్ళ శిక్ష అనుభవించిన స‌త్యంబాబుకు బాస‌ట‌గా నిలిచేందుకు స‌ద‌రు నేత‌లు ఎవ‌రూ ముందుకు రాలేదు. ఒక్క ఆమ్ ఆద్మీ పార్టీ ముంద‌డుగు వేసింది. విజ‌య‌వాడ‌లో ఆప్ నేత పోతిన వెంక‌ట రామారావు ఆధ్వ‌ర్యంలో పార్టీ నేత‌లు స‌త్యంబాబుకు కొంత ప‌రిహారాన్ని చెక్కుగా అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆప్ న‌గ‌ర నేత కంభంపాటి కృష్ణ‌మూర్తి, ఫ‌ణిరాజ్, బీజాపూర్ శ్యాం త‌దిత‌రులు పాల్గొన్నారు. 17795996_1479943352018654_6474550748084054464_n

Author Biography:

Leave a Reply

Translate »