క్యా కియా సీఎం సాబ్ ! (Kia cars company enters)

క్యా కియా సీఎం సాబ్ !  (Kia cars company enters)

క్యా కియా సీఎం సాబ్ ! (Kia cars company enters)

అమ‌రావ‌తి (రియ‌ల్ న్యూస్‌): ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కీల‌క‌మైన కియా కంపెనీ ఒప్పందాన్ని విజ‌య‌వంతం చేశారు. అనంతపురం జిల్లాలో కార్ల కంపెనీ స్థాపనకు అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం, కొరియాకు చెందిన కియా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. సచివాలయం ఒకటవ బ్లాక్‌లో సీఎం చంద్ర‌బాబు స‌మ‌క్షంలో కియా కంపెనీ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. రూ.13 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ తయారీ కేంద్రంలో ఏటా 3 లక్షల చిన్న కార్లు తయారవుతాయి. యని తెలిపారు. 2019 జూన్ నాటికి ఉత్పత్తి ప్రారంభిస్తారని, ఇక్కడ తయారయ్యే కార్లలో 90 శాతం దేశీయ మార్కెట్‌లోనే విక్రయిస్తారని సీఎం వివ‌రించారు. కార్ల ఉత్పత్తి కేంద్రంలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ కేంద్రం ద్వారా 12 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందన్నారు. 2020 నాటికి ఆటోమొబైల్ రంగంలో రాష్ట్రంలో రెండు లక్షల మందికి ఉపాధి లభించాలనేది తమ లక్ష్యం అన్నారు. కర్నూలు జిల్లాలో ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు సీఎం తెలిపారు. అది 1000 మెగావాట్లు ఉత్పత్తి సామర్థ్యం తో ఏర్పాట‌వుతుంద‌ని చెప్పారు.DSC_9225

Author Biography:

Leave a Reply

Translate »