SHMedicsతో ఆరోగ్యం ఇక ఇంటి వ‌ద్ద‌కే! Your Health@your door steps

SHMedicsతో ఆరోగ్యం ఇక ఇంటి వ‌ద్ద‌కే! Your Health@your door steps

SHMedicsతో ఆరోగ్యం ఇక ఇంటి వ‌ద్ద‌కే! Your Health@your door steps

ఇంటింటికీ వైద్యం… ఎస్.హెచ్. మెడిక్స్ స‌రి కొత్త పంథా
WhatsApp Image 2016-12-26 at 5.51.51 PM (4)
విజ‌య‌వాడ‌: మ‌నం వృత్తిరీత్యా ఎక్క‌డో ఉంటాం… మ‌న త‌ల్లిదండ్రులు, పిల్ల‌లు ఇక్క‌డ ఇంటి వ‌ద్ద అనేక ఆరోగ్య సమ‌స్య‌ల‌తో ఇబ్బందిప‌డుతుంటారు. అలాంటి వారికి వ‌రంలా, స‌రికొత్త పంథాలో వైద్యం, ఆరోగ్యాన్ని అందించేందుకు ముందుకు వ‌చ్చింది… ఎస్.హెచ్. మెడిక్స్. మీ ఆరోగ్య సంర‌క్ష‌ణే మా ల‌క్ష్యం అంటూ… కొంద‌రు యువ డాక్ట‌ర్లు విదేశీ ప‌రిజ్ణ్నానంతో ఇక్క‌డే డిజిట‌ల్ థెర‌పెటిక్స్ ప‌ద్ధ‌తిని మ‌న‌ముందుకు తెచ్చారు. మీ ఇంట్లో పెద్ద‌లు, మ‌హిళ‌లు గ‌డ‌ప దాట‌కుండానే, మీ ఇంటికి ఆరోగ్యం, వైద్యం అందించే ఈ ప్ర‌క్రియ‌ను కొత్త‌గా విజ‌య‌వాడ‌లో ప్రారంభిస్తున్న‌ట్లు డాక్ట‌ర్ కె.వినోద్ కుమార్, ఎం.శ్రీహ‌ర్ష తెలిపారు. విజ‌య‌వాడ‌లో ఆదివారం ఈ స‌రికొత్త ప్ర‌యోగానికి శ్రీకారం చుడుతూ, న‌గ‌రంలోని వైద్య నిపుణుల‌తో ఎస్.హెచ్. మెడిక్స్ మీట్ ని భ‌వానీపురంలో ఏర్పాటు చేశారు. మ‌జ్జి స‌త్యన్నారాయ‌ణ‌, హైమ దంప‌తులు జ్యోతి వెలిగించి సెష‌న్స్ ని లాంఛ‌నంగా ప్రారంభించారు. ముందుగా ఎస్.హెచ్.ఎం. సిఇఓ హ‌ర్ష వైద్య నిపుణుల స‌మ‌క్షంలో డిజిట‌ల్ థెర‌పెటిక్స్ న‌మూనాను ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్ ద్వారా వివ‌రించారు. యువ‌ర్ హెల్త్ @ యువ‌ర్ డోర్WhatsApp Image 2016-12-26 at 5.51.51 PM (3)
స్టెప్స్ లాంఛ‌నంగా ప్రారంభిస్తున్న‌ట్లు తెలిపారు. దీని ద్వారా రోగి ఇంటి వ‌ద్దే ప్రాథ‌మిక వైద్య ప‌రీక్ష‌లు, ఆరోగ్య సూచ‌న‌లు అందిస్తామ‌న్నారు. దీనితోపాటు వ్య‌క్తిగ‌త ఆరోగ్యం, వెల్ నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఇంటింటికీ అందించే వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. ఇంటి వ‌ద్దే యోగా, ఫిజియోథెర‌పీ, ఫిజియో థెర‌పిటెక్స్ ప్రోగ్రాంలు రూపొందించామ‌ని ఎస్.హెచ్. మెడిక్స్ సి.ఇ.ఓ ఎం.శ్రీహ‌ర్ష తెలిపారు. ఎస్.హెచ్.మెడిక్స్ ప్రివెంటివ్ హెల్త్ సెంట‌ర్స్ యు.ఎస్. లో
ని క్లీవ్ ల్యాండ్, టెక్సాస్, కెన‌డాల‌తోపాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, రాజ‌మండ్రి, తిరుప‌తిలో ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణాలోని హైద‌రాబాద్, వ‌రంగ‌ల్, జంషెడ్ పూర్, బెంగ‌ళూరు, పాట్నా త‌దిత‌ర ప్రాంతాల్లో హెల్త్ సెంట‌ర్స్ ప‌నిచేస్తున్న‌ట్లు డాక్ట‌ర్ హారికWhatsApp Image 2016-12-26 at 5.51.51 PM (6) తెలిపారు. విజ‌య‌వాడ‌లోని భ‌వానీపురంలో
ఎస్.హెచ్.మెడిక్స్ ప్రివెంటివ్ కేర్ ఏర్పాటు చేశామ‌ని వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చిన వైద్య నిపుణులు పాల్గొని, ఎస్.హె
చ్. మెడిక్స్ స‌రికొత్త వైద్య సేవ‌ల‌ను కొనియాడారు. త్వ‌ర‌లో తాము అన్ని ప‌ట్ట‌ణాల‌లో ఇంటింటి స‌ర్వే జ‌రిపి ప్రివెంటివ్ హెల్త్ పై అవ‌గాహ‌న క‌ల్పిస్తామ‌న్నారు. కార్యక్రమంలో ఎస్.హెచ్.ఎం.  సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ వివేక్, డాక్టర్ హారిక, హర్ష తమ సంస్థ అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తుందని వివరించారు.WhatsApp Image 2016-12-26 at 5.51.51 PM

Author Biography:

Leave a Reply

Translate »