స్టార్ట్ అప్ ని ఉర‌క‌లెత్తిస్తున్న జీటీఎస్ (boost up to Start-up.. Rendezvous 2016)

స్టార్ట్ అప్ ని ఉర‌క‌లెత్తిస్తున్న జీటీఎస్ (boost up to Start-up.. Rendezvous 2016)

స్టార్ట్ అప్ ని ఉర‌క‌లెత్తిస్తున్న జీటీఎస్ (boost up to Start-up.. Rendezvous 2016)

14440830_1255239457840654_4278004136208659706_n (1) 

14520540_1255240011173932_930982501889351758_n14523189_1781453092093791_2759505800680048756_nవిజ‌య‌వాడ‌: న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ లో పారిశ్రామిక ప్ర‌గ‌తికి ఉప‌క‌రించే స్టార్ట్ అప్ కార్య‌క్ర‌మాలు ఊపందుకుంటున్నాయి. గ్లోక‌ల్ టెక్నాల‌జీ సొల్యూష‌న్స్ (GTS) దీనికి చేయూత అందిస్తోంది. తాజాగా కె.ఎల్.యూనివ‌ర్సిటీలో జ‌రిగిన rendezvous 2016 స‌రికొత్త ఆలోచ‌న‌ల‌కు వేదిక అయింది. యువ ఇంజ‌నీర్ల మెద‌ళ్ళ‌ను క‌దిలించి… స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ఊపిరి పోసింది. గ్లోక‌ల్ టెక్నాల‌జీ సొల్యూష‌న్స్ (GTS) సి.ఇ.ఓ. త‌రుణ్ కాకాని గెస్ట్ స్పీక‌ర్ గా ఈ కార్య‌క్ర‌మాన్ని ఆద్యంతం అర్ధ‌వంతంగా న‌డిపించారు. అమ‌రావ‌తి స‌రికొత్త రాజ‌ధాని నిర్మాణ నేప‌థ్యంలో స్టార్ట్ అప్ కి ప్రభుత్వ ప‌రంగా ప్రోత్సాహం స‌మీప భ‌విష్య‌త్తులో ల‌భిస్తుంద‌ని యువ‌త‌కు త‌రుణ్ కాకాని భ‌రోసా ఇచ్చారు. అంతేకాదు ఒక స్టార్ట్ అప్ కి (GTS) అక్క‌డిక్క‌డ ఫండింగ్ కూడా అందించ‌డంతో rendezvous 2016 ర‌క్తిక‌ట్టింది. ఈ ఈవెంట్ ని హోస్ట్ చేసిన సిటీవో యాంథోని గాడ్ విన్, మ‌హిళా పారిశ్రామిక‌వేత్త నీలిమ. సిహెచ్.ల‌తోపాటు కె.ఎల్. యూనివ‌ర్సిటీ వైస్ ప్రెసిడెంట్ రాజా హ‌రీన్ కోనేరుల అమూల్య‌మైన సందేశాలు యువ ఇంజ‌నీర్ల‌లో స్టార్ట్ అప్ చైత‌న్యాన్ని ర‌గిలించాయి. కె.ఎల్.యు. లోని CIIE cell ఇన్ఛార్జి డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ త‌దిత‌రులు త‌మ అభిప్రాయాల‌ను ఈ స‌ద‌స్సులో వెల్ల‌డించారు. ఇలాంటి మ‌రిన్ని స్టార్ట్ అప్ స‌ద‌స్సుల‌ను నిర్వ‌హించి, యువ ఇంజ‌నీర్ల‌లో నిభిడీకృత‌మైన చైత‌న్యాన్ని వెలికి తీస్తామ‌ని (GTS) సి.ఇ.ఓ. త‌రుణ్ కాకాని వెల్ల‌డించారు. ఈ కార్య‌క్ర‌మానికి అండ‌గా నిలిచిన కె.ఎల్.యు. వైస్ ప్రెసిడెంట్ రాజా హ‌రీన్ కోనేరులతో పాటు విద్యార్థినీ విద్యార్థుల‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు.
14480742_678730435613752_9129079678685007974_o

Author Biography:

Leave a Reply

Translate »