ప‌వ‌న్ క‌ల్యాణ్ కొత్త ఇల్లు ఇదే... (pavan kalyan @ eluru)

ప‌వ‌న్ క‌ల్యాణ్ కొత్త ఇల్లు ఇదే… (pavan kalyan @ eluru)

ప‌వ‌న్ క‌ల్యాణ్ కొత్త ఇల్లు ఇదే… (pavan kalyan @ eluru)

image (1)
ఏలూరు: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఇంత వ‌ర‌కు హైద‌రాబాద్ జూబ్లి హిల్స్ లో ఇల్లు ఉంది. కానీ, ఇపుడు ఆయ‌న కేరాఫ్ అడ్ర‌స్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ఏలూరుకు మార‌బోతోంది. జ‌న‌సేన అధినేత‌గా ఆయ‌న రాజ‌కీయ అరంగేట్రం చేసిన నేప‌థ్యంలో… వ‌చ్చే ఎన్నిక‌ల‌క‌ల్లా ప‌వ‌న్ పెద్ద రాజ‌కీయ శ‌క్తిగా ఎద‌గ‌బోతున్నారు. దీనికోసం ఆయ‌న రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో కేంద్రంలో మోదీకి, రాష్ట్రంలో చంద్ర‌బాబుకు స‌పోర్ట్ చేసిన ప‌వ‌న్…ఈసారి జ‌నసేన ప్ర‌తినిధుల‌ను ఎన్నిక‌ల్లో పోటీకి దింపుతార‌ని ప‌క్కాగా స‌మాచారం ఉంది. అందుక‌నే ఆయ‌న త‌న ఓట‌ర్ ఐడి కార్డును జూబ్లిహిల్స్ నుంచి ఏలూరుకు మార్చేస్తున్నారు. ఏలూరులో ఆయ‌న నివాసం ఇదే. ఇక్క‌డ ఆయ‌న ఒక సొంత ఇంటిని అప్ప‌టిక‌ప్పుడు కోనేందుకు అగ్రిమెంట్ చేసుకున్నార‌ని తెలుస్తోంది. అయితే, దీనిని పార్టీ కార్యాల‌యంగా కూడా వినియోగిస్తారా? లేక త‌ను ఉండే ఇల్లుగానే వినియోగిస్తారా అనేది మాత్రం స్ప‌ష్టం కాలేదు. ప్ర‌స్తుతానికి ఓట‌ర్ ఐడి కోసం మాత్రం ఈ ఇంటినే చూపిస్తార‌ని తెలుస్తోంది.image

Author Biography:

Leave a Reply

Translate »