VISWA BRAHMIN SANGAM

VISWA BRAHMIN SANGAM

a5c77e35-c19e-4d66-9bd1-97a07c46be5c ఒంగోలులో ఏలూరి కోటేశ్వ‌ర‌రావుకు స‌న్మానం… - ఒంగోలులో ఏలూరి కోటేశ్వ‌ర‌రావుకు స‌న్మానం… ఒంగోలు: ఆంధ్ర‌ప్ర‌దేశ్ విశ్వ‌బ్రాహ్మ‌ణ ఫైనాన్స్ ఫెడ‌రేష‌న్ డైరెక్ట‌ర్ గా ఎన్నిక‌యిన ఏలూరి కోటేశ్వ‌ర‌రావును ప్ర‌కాశం జిల్లా విశ్వ‌బ్రాహ్మ‌ణ సంఘం స‌న్మానించింది. ఒంగోలు చైత‌న్య రెసిడెన్సీలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా య‌ర్ర‌గొండ‌పాలెం ఎమ్మెల్యే పాల‌ప‌ర్తి డెవిడ్ రాజు ఏలూరి కోటేశ్వ‌ర‌రావును స‌న్మానించారు. ప్ర‌కాశం జిల్లా విశ్వ‌బ్రాహ్మ‌ణ సంఘం గౌర‌వాధ్య‌క్షులు...

vk3

విశ్వ బ్రాహ్మ‌ణ సంఘం.

 

WhatsApp-Image-20160705 (1)
విజ‌య‌వాడ‌: ప‌ంచ వృత్తుల‌తో ప్ర‌భుత్వ‌ ఆద‌ర‌ణ క‌ర‌వైన విశ్వబ్రాహ్మ‌ణుల‌ను బీసీ బి జాబితా నుంచి ఏ జాబితాకు మార్చాల‌ని రాష్ట్ర విశ్వ‌బ్రాహ్మ‌ణ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేర‌కు విశ్వ‌బ్రాహ్మ‌ణ సంఘ ప్ర‌తినిధులు మంగ‌ళ‌వారం మంజునాథ‌న్ క‌మిష‌న్ ను క‌లిసి విన‌తి ప‌త్రాన్ని అందించారు. విజ‌య‌వాడ‌లోని బీసీ క‌మిష‌న్ కార్యాల‌యంలో విశ్వ‌బ్రాహ్మ‌ణ సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు బంగారు వెంక‌టేశ్వ‌ర్లు, రాష్ట్ర యువ‌జ‌న ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి తోలేటి శ్రీకాంత్, లీగ‌ల్ అడ్వ‌యిజ‌ర్ ల‌క్కోజు రామ‌స్వామి, డి.వి.డి. సుబ్ర‌హ్మ‌ణ్యం, అట్లూరి ప‌ర‌బ్ర‌హ్మం త‌దిత‌రులు మంజునాధ‌న్ క‌మిష‌న్ ని క‌లిశారు. విశ్వ‌బ్రాహ్మ‌ణులు అయిదు కుల‌వృత్తుల్లో స‌రైన ఉపాధి, ఆర్ధిక స‌హాయం లేక దారిద్ర్ర్యాన్ని అనుభ‌విస్తున్నార‌ని, 80 ఏళ్ళ క్రితం నిర్ణ‌యించిన బీ కేట‌గిరీని ఇప్ప‌టికీ అమ‌లు చేయ‌డం త‌గ‌ద‌ని బంగారు వెంక‌టేశ్వ‌ర్లు క‌మిష‌న్ కు వివ‌రించారు. అలాగే తాము బీసీ సంఘాలంద‌రితో క‌లిసి కాపు రిజ‌ర్వేష‌న్ ని వ్య‌తిరేకిస్తున్నామ‌ని ప్ర‌తినిధులు క‌మిష‌న్ కి విన‌తిప‌త్రాన్ని అందించారు. బి.సి. క‌మిష‌న్ కార్యాల‌యం ఎదుట బిసీ సంఘాల‌తో క‌లిసి ధ‌ర్నా చేశారు. ఇందులో యాద‌వ సంఘం అధ్య‌క్షుడు లాకా వెంగ‌ళ‌రావు యాదవ్ తో పాటు వివిధ బీసీ సంఘాల నాయ‌కులు పాల్గొన్నారు.

విశ్వబ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్ కోసం ఉద్య‌మ భేరీ..

– సీఎం గారూ… గ‌త ఎన్నిక‌ల్లో బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ఇచ్చాం…IMG-20160703-WA0032.jpg
– 2009 విశ్వ‌బ్రాహ్మ‌ణ ఫైనాన్స్ కార్పొరేష‌న్ పున‌రుద్ధిరించండి
– లేకుంటే, పంచ‌వృత్తుల వారితో రాష్ట్ర‌వ్యాప్త ఉద్య‌మం…
– విజ‌య‌వాడ‌లో ఏపీ విశ్వ‌బ్రాహ్మ‌ణ సంఘం కోర్ క‌మిటీ స‌మావేశం
– సీఎం చంద్ర‌బాబుకు జ‌నాభా ప్రాతిప‌దిక‌న నివేదిక
విజ‌య‌వాడ‌: విశ్వ‌బ్రాహ్మ‌ణ ఫైనాన్స్ కార్పొరేషన్ సాధించేందుకు ఉద్య‌మ భేరీ మోగిస్తున్న‌ట్లు ఏపీ విశ్వ‌బ్రాహ్మ‌ణ సంఘం ప్ర‌క‌టించింది. సంఖ్యా బ‌లం 45 ల‌క్ష‌లు ఉన్న విశ్వ‌బ్రాహ్మ‌ణుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం చేస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. విజ‌య‌వాడ‌లో ఆదివారం ఏపీ విశ్వ‌బ్రాహ్మ‌ణ సంఘం కోర్ క‌మిటీ స‌మావేశం హోట‌ల్ అయిలాపురంలో జ‌రిగింది. ఏపీలోని 13 జిల్లాల నుంచి హాజ‌రైన ప్ర‌తినిధుల స‌మావేశానికి రాష్ట్ర అద్య‌క్షుడు బంగారు వెంక‌టేశ్వ‌ర్లు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నాగుల‌కొండ ఆశ్లేషాచారి అధ్య‌క్ష‌త వ‌హించారు. వ‌చ్చేనెల న‌వ్యాంధ్ర రాజ‌ధానిలో వేలాది మందితో ఉద్య‌మ భేరీ నిర్వ‌హించాల‌ని కోర్ క‌మిటీ నిర్ణ‌యించింది. రాష్ట్రంలో 45 ల‌క్ష‌ల జ‌నాభా ఉన్న విశ్వ‌బ్రాహ్మ‌ణుల‌కు ఫైనాన్స్ కార్పొరేష‌న్ కాకుండా, ఫెడ‌రేష‌న్ ఏర్పాటు చేయడం ఎంత‌వ‌ర‌కు సమంజ‌సం అని అద్య‌క్షుడు బంగారు వెంక‌టేశ్వ‌ర్లు ప్ర‌శ్నించారు. గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ఇచ్చిన ఏకైక సంఘం త‌మ‌ద‌ని, గ‌త ప్ర‌భుత్వం 2009లో జోవో నెం 85\2009లో ఫైనాన్స్ కార్పొరేష‌న్ మంజూరు చేసి నిధులు కేటాయించ‌క‌పోవ‌డంతో స‌మ‌స్య త‌లెత్తింద‌ని వివ‌రించారు. న‌వ్యాంద్ర సీఎం చంద్ర‌బాబు ఇప్ప‌టికైనా స్పందించి, విశ్వ‌బ్రాహ్మ‌ణ ఫైనాన్స్ కార్పొరేష‌న్ పున‌రుద్ధిరించాల‌ని ఆశ్లేషాచారి డిమాండు చేశారు. లేకుంటే, పంచ‌వృత్తుల వారితో వ‌చ్చే నెల‌లో భారీ ఉద్య‌మ బేరీ నిర్వ‌హిస్తామ‌న్నారు. అమ‌రావ‌తిలో విశ్వ‌క‌ర్, కాల‌జ్ణాన క‌ర్త‌ వీర‌బ్ర‌హ్మేంద్ర‌స్వామి దేవాల‌యాల‌కు 5 ఎక‌రాలు కేటాయించాల‌ని, , పేద విద్యార్థుల‌కు ఉచిత విద్య‌, ఎన్టీయార్ గృహ క‌ల్ప‌లో పేద‌ల‌కు ఇళ్ళ మంజూరు చేయాల‌ని డిమాండు చేశారు.
IMG-20160703-WA0033.jpgఈ స‌మావేశంలో ధ‌నాల కోట కాళేశ్వ‌ర‌రావు, తోలేటి శ్రీకాంత్, రాష్ట్ర ఉపాద్య‌క్షులు దివి ఉమా మ‌హేశ్వ‌ర‌రావు, ప‌ట్నాల వ‌ర‌ప్ర‌సాద్, ఎం. సిద్ధ‌య్య ఆచారి, రాష్ట్ర కార్య‌ద‌ర్శి శివ‌శ్రీ, విశాఖ జిల్లా అధ్య‌క్షుడు పెద‌పాటి గోవింద‌రావు, కార్య‌ద‌ర్శి శివ‌కోటి ర‌త్నాక‌ర్, చేవూరి ర‌మేష్‌, కె.మ‌ద‌న‌మోహ‌నా చారి (క‌ర్నూలు బీజేపీ నేత‌), టిప‌ర్థి శ‌శిధ‌ర‌, కాయం సుధాక‌రాచారి (తిరుప‌తి ప‌వ‌ర్ ఛీఫ్ ఎడిట‌ర్), ధ‌నాల‌కోట శ్రీనివాస రావు (శ్రీ విశ్వ‌క‌ర్మ గోల్డ్ ఆర్న‌మెంట‌ల్ మాన్యుఫాక్చ‌ర‌ర్స్) , వేణుగోపాల‌కృష్ణ‌, నాగాచారి (సి.కె.జ్యూయ‌ల‌రీ వ‌ర్క్స్, ప్యూ, వి.డి.ఎల్.ఆర్. మోహ‌న్ (పూర్ణిమ ఎల‌క్ట్రానిక్స్), ఎం.ఎన్ రాజా (సుప్ర‌జా కెమిక‌ల్స్), జి.వి.రమ‌ణాచారి (జి.వి.ఆర్. మ్యారేజ్ లింక్స్), అనుపోజు ఫ‌ణికుమార్, పి.వి.ఎల్.ఎస్. శ్రీనివాస్, ప‌ట్నాల శ్రీనివాస్ (రాజోలు), త‌దిత‌రులు పాల్గొన్నారు.

బెజ‌వాడ‌లో బ్రహ్మంగారి దేవాల‌య పున‌ర్ నిర్మాణానికి కృషి

బెజ‌వాడ‌లో బ్రహ్మంగారి దేవాల‌య పున‌ర్ నిర్మాణానికి కృషి

 – పంచ వృత్తుల‌ను ఆదుకునేందుకే విశ్వ‌బ్రాహ్మ‌ణ ఫెడ‌రేష‌న్ ఏర్పాటు
– ఘ‌నంగా విజ‌య‌వాడ విశ్వ‌బ్రాహ్మ‌ణ సంఘం ప్ర‌మాణ‌స్వీకారం
– ప్ర‌మాణ స్వీకార‌ మ‌హోత్స‌వంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు బోండా ఉమ‌, జ‌లీల్ ఖాన్, ఎంపీ గ‌ద్దె రామ్మోహ‌న్
– స‌నారి విజ్ణ్నాన మండ‌పానికి పున‌ర్ నిర్మించాలి: బ‌ంగారు వెంక‌టేశ్వ‌ర్లు
విజ‌య‌వాడ‌: విజ‌య‌వాడ న‌గ‌రంలో బ్ర‌హ్మంగారి దేవాల‌యం పున‌ర్ నిర్మాణానికి త‌మ వంతు కృషి చేస్తామ‌ని, ఇప్ప‌టికే సీఎం చంద్ర‌బాబు దీనిపై హామీ ఇచ్చార‌ని తెలుగుదేశం ఎమ్మెల్యేలు బోండా ఉమ‌, జ‌లీల్ ఖాన్ స్ప‌ష్టం చేశారు. ప‌ద్మావ‌తి ఘాట్ వ‌ద్ద ఇటీవ‌ల తొల‌గించిన స‌నారి విజ్ణ్నాన మండ‌పానికి కూడా స్థ‌లం కేటాయించేందుకు కృషి చేస్తామ‌న్నారు. విజ‌య‌వాడ విశ్వ‌బ్రాహ్మ‌ణ సంఘం కొత్త పాల‌క‌వ‌ర్గం ప్ర‌మాణ‌స్వీకారానికి ఎంపీ గ‌ద్దె రామ్మోహ‌న్, ఎమ్మెల్యేలు బోండా ఉమ‌, జ‌లీల్ ఖాన్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. విజ‌య‌వాడ‌లోని గాంధీజీ మున్సిప‌ల్ హైస్కూలులో ధ‌నాల‌కోట కాళేశ్వ‌ర‌రావు అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ స‌మావేశంలో ఎమ్మెల్యేలు మాట్లాడుతూ, విశ్వ‌బ్రాహ్మ‌ణ పంచ‌వృత్తుల వారిని ఆదుకునేందుకు ప్ర‌భుత్వం విశ్వ‌బ్రాహ్మ‌ణ ఫెడ‌రేష‌న్ ఏర్పాటు చేసింద‌న్నారు. ఇక‌పై స్మార్ట్ స‌ర్వే ద్వారా అన్ని కులాల గ‌ణాంకాలు స్ప‌ష్టంగా వ‌చ్చేస్తాయ‌ని ఎమ్మెల్యే బోండా ఉమ చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యేలు, రాష్ట్ర విశ్వ‌బ్రాహ్మ‌ణ సంఘం అధ్య‌క్షులు బంగారు వెంక‌టేశ్వ‌ర్లు స‌మ‌క్షంలో న‌గ‌ర అధ్య‌క్షుడిగా గొర్తి శ్రీనివాస చ‌క్ర‌వ‌ర్తి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా తోలేటి శ్రీకాంత్, కోశాధికారిగా విస్సాకోటి మార్కండేయులు ప‌ద‌వీ ప్ర‌మాణం చేశారు. ఈ సంద‌ర్భంగా కొత్త పాల‌కవ‌ర్గం ప్ర‌తినిధులు మాట్లాడుతూ, న‌గ‌రంలోని పంచ వృత్తుల వారికి ఏ క‌ష్టం వ‌చ్చినా విజ‌య‌వాడ విశ్వ‌బ్రాహ్మ‌ణ సంఘం అండ‌గా నిలుస్తుంద‌న్నారు. త్వ‌ర‌లో న‌గ‌రంలోని 59 డివిజ‌న్ల‌కు క‌మిటీల‌ను వేసి ప్ర‌త్య‌క్ష కార్యాచ‌ర‌ణ‌కు దిగుతామ‌ని అధ్య‌క్షుడు చ‌క్ర‌వ‌ర్తి, ప్ర‌ధాన‌ కార్య‌ద‌ర్శి తోలేటి శ్రీకాంత్ చెప్పారు. సొసైటీలకు బీసీ కార్పొరేష‌న్ నుంచి రుణాల అందేలా కృషి చేస్తామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో విశ్వ‌కర్మ ప‌తాకావిష్క‌ర‌ణ పుల్లేటి కుర్తి ప్ర‌సాద్ చేయ‌గా, పెంటి నాగ‌రాజు, డాక్ట‌ర్ చిల‌క‌ల‌పూడి క‌ళాధ‌ర్, అనుపోజు ఫ‌ణికుమార్, చేవూరి ర‌మేష్, జ‌వ్వాది కూర్మాచారి, డాక్ట‌ర్ వ‌జ్రాల శివ‌కుమార్, దివి ఉమామ‌హేశ్వ‌ర‌రావు, వెణుతురిమిల్లి హ‌ర్ నాధ్ బాబు, చ‌ట‌ర్జీ, రామ్మోహ‌న్, రాష్ట్ర మ‌హిళ అధ్య‌క్షురాలు తాళాబ‌త్తుల వాస‌వి త‌దిత‌రులు పాల్గొన్నారు.

IMG-20160710-WA0057.jpg IMG-20160710-WA0071.jpg

 

IMG-20160710-WA0062.jpgIMG-20160710-WA0061.jpg

WhatsApp-Image-20160721 (1)

విశ్వబ్రాహ్మణ ఫెడ‌రేష‌న్ కు సీఎం చంద్ర‌బాబు భ‌రోసా

విజ‌య‌వాడ‌: రాష్ట్రంలోని స్వ‌ర్ణ‌కారుల‌కు, పంచ వృత్తుదారుల‌కు ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌ను అందించేందుకు కృషి చేయాల‌ని సీఎం చంద్ర‌బాబు సూచించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విశ్వ‌బ్రాహ్మ‌ణ సంఘం అధ్య‌క్షుడు బంగారు వెంక‌టేశ్వ‌ర్లు ఆధ్వ‌ర్యంలో ప్ర‌తినిధులు గురువారం సీఎంను క‌లిశారు. విశ్వ‌బ్రాహ్మ‌ణ ఫెడ‌రేష‌న్ ఏర్పాటు చేసినందుకు చంద్ర‌బాబుకు కృత‌జ్ణ‌తలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాలు నిరుపేద‌ల‌కు అందేట్లు ఫెడ‌రేష‌న్ కృషి చేయాల‌న్నారు. మీరు చేసే సేవ‌లను తెలుగుదేశం పార్టీ గుర్తించి, భ‌విష్య‌త్తులో ఉన్న‌త ప‌ద‌వుల్లో అవ‌కాశం క‌ల్పిస్తుంద‌ని హామీ ఇచ్చారు. పంచ‌వృత్తుల వారికి మీరు రుణ ప‌థ‌కాలు అందించండి, మీ వెనుక నేనున్నాఅంటూ భ‌రోసా ఇచ్చారు. సీఎం క‌లిసిన వారిలో విశ్వ‌బ్రాహ్మ‌ణ ఫెడ‌రేష‌న్ డైరెక్ట‌ర్లు ఏలూరి కోటేశ్వ‌ర‌రావు, గోడి న‌ర‌సింహాచారి, ముగ‌డ స‌త్య‌న్నారాయ‌ణ‌, న‌గ‌ర అధ్య‌క్షుడు తోలేటి శ్రీకాంత్, కాళేశ్వ‌ర‌రావు, త‌దిత‌రులున్నారు.

Translate »